సిరా న్యూస్, మానకొండూర్:
జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తోందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.