సిరా న్యూస్, సైదాపూర్:
సైదాపూర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
సైదాపూర్ మండల కేంద్రంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాస్, సాగర్, సతీష్, శ్రీకాంత్, బన్నీ, అజయ్, మహేందర్, చందు పాల్గొన్నారు.