సిరా న్యూస్,నల్గోండ;
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామంలో గతంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేసారు. అయితే, మునుగోడు నియోజక వర్గం లోని చండూరు మండలంలో స్కూల్ పిల్లలు దాదాపు ఇరవై వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను రవాణా వ్యవస్థ సరిగా లేని మునుగోడు మండలం కొండాపురం కొంపెల్లి మధ్యలో గల కల్వకుంట్ల గ్రామం లో శంకుస్థాపన చేయడం కరెక్ట్ కాదని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను చండూరు ఈ మండలంలో ఏర్పాటు చేయాలని రాజగోపాల్ రెడ్డి కి వ్యతిరేకంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.