సిరా న్యూస్,నరసాపురం;
కార్తీకమాసం వస్తున్న సందర్భంగా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పడవలో రేవు దగ్గర ఉన్న శివాలయం మరియు వలంధర రేవు వద్ద కార్తీకమాసం ఏర్పాట్లను పరిశీలించారు. సందర్భంగా మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా రేవులో భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని.గోదావరి లో స్నానమాచరించే భక్తులకు ప్రమాదాలు జరగకుండా చూడాలని.పరిసరాలలో పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు అధికారులు పాల్గొన్నారు.