సిరాన్యూస్, జైనథ్
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన చర్యలు : ఎమ్మెల్యే పాయల్ శంకర్
* అదనపు తరగతులు నిర్మాణానికి భూమి పూజ
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతులు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అదనపు తరగతుల నిర్మాణానికి రూ:13.50 లక్షల నిధుల వ్యయంతో నిర్మించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విద్యార్థులు కావలసిన సౌకర్యాలు, నిర్మాణంలో ఉన్న భవనాల పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఉపాధ్యాయ ఖాళీల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కాళీ పోస్టులలో విద్యా వాలంటరీల నియమించాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బీజేపీ నాయకులు బోయర్ విజయ్ , అశోక్ రెడ్డి, రాందాస్, రమేష్ రెడ్డి , రాకేష్ రెడ్డి, ప్రతాప్, విశాల్ పోతరాజు రమేష్, ముకుందరావు, రాకేష్ , సీడం రాకేష్, సుభాష్, అశోక్, తదితరులు పాల్గొన్నారు