సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆదిలాబాద్‌లో సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం : ఎమ్మెల్యే పాయల్ శంకర్
* పంటలకు కనీసం మద్దతు ధర దొరకాలి
రైతులు పండించిన పంటలకు కనీసం మద్దతు ధర దొరకాలని అదేవిధంగా ధర స్థిరంగా ఎప్పుడూ ఉండేలా చూడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో మార్క్ఫెడ్ ద్వారా సోయా కొనుగోలు కేంద్రాన్ని బీసీసీ బి చైర్మన్ అడ్ఢీ భోజ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్యామల దేవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… పత్తి పంటను సిసిఐ ద్వారా సోయా పంటను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయాలని కోరారు. సంవత్సరం కాలం పాటు పండించిన పంటలకు కనీస మత ధర ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే మార్కెట్ యార్డ్ కి రైతులు ఎప్పుడు వచ్చినా అవగాహన కల్పించి చిన్నచిన్న విషయాలకు ఇబ్బందులు కలిగించకుండా చూడాలన్నారు. పత్తి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇదివరకే పత్తి పంట కొనుగోలు విషయంలో జిల్లా అధికారులతో మార్కెట్ అధికారులతో సమావేశం నిర్వహించాలని తెలిపారు. త్వరలోనే పత్తి పంట కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసు కోవాలన్నారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వ విధివిధానాలతోనే మార్కెట్ యార్డ్ కు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ ముర్చా జిల్లా అధ్యక్షులు దయాకర్ , ఆకుల ప్రవీణ్, అశోక్ రెడ్డి, జోగు రవి, గొర్ల రాము, సోమా రవి, రాజేష్, ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.