సిరా న్యూస్,ఆదిలాబాద్
దసరా మైదానంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమి పూజ
* దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు . హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గల దస్నాపూర్ లో ఏర్పాటు చేయనున్న రావణ దహన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లకు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే సమితి సభ్యులు నాయకులు కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే దసరా ఉత్సవాలను అనాదిగా పట్టణం లో జరుగుతున్న గొప్ప సాంప్రదాయాన్ని స్థానిక కన్యక పరమేశ్వరి ఆలయం నుండి దస్నాపూర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అన్నారు. దస్నాపూర్ లో నిర్వహించే దసరా వేడుకలకు హిందూ బంధువులందరూ వేలాది సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో లోని ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు, గొప్పతనాన్ని వీక్షిస్తుందన్నారు. హిందూ మతం ఎక్కడ ఉంటే అక్కడ శాంతి ఉంటుందన్నారు. జిల్లా ప్రజలకు దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు .కార్యక్రమంలో సమితి అధ్యక్షులు హనుమండ్లు, శ్రీనివాస్, వేణుగోపాల్, రాళ్ల బండి మహేందర్, భరత్, రఘుపతి, లాలామున్న, శ్రీనివాస్, ఆదిత్య, సంతోష్, దాము, సచిన్, సాయి, తదితరు పాల్గొన్నారు