సిరాన్యూస్, ఆదిలాబాద్
మాజీ ఉపసర్పంచ్ తో సహా బీజేపీలో చేరిన 200 మంది
* పార్టీ కండువా కప్పి స్వాగతం పలికిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని బెల్లూరి గ్రామం మాజీ ఉపసర్పంచ్ దుర్వాచంపత్ రావు తో పాటు 200 మంది పార్టీలో చేరారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఉపసర్పంచ్ బెల్లూరికి చెందిన 200 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో బీజేపీ ఎమ్మెల్యేగా మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని ఆ తర్వాత పార్టీలో చేరుతామని హామీ ఇచ్చారని ఇచ్చిన హామీ మేరకే నేడు పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. భారతీయ జనతా పార్టీలో పనిచేస్తుంటే దేశ రక్షణలో ఆర్మీ జవాన్ రక్షణ కల్పిస్తాడు, అదే సంతృప్తి పార్టీ కార్యకర్తల్లో లభిస్తుందన్నారు. కార్యక్రమంలోజైనథ్ మండలాధ్యక్షులు రాందాస్ అశోక్ రెడ్డి, పోతరాజు రమేష్ లాలామున్న, రవి, రాకేష్, రమేష్, కృష్ణారెడ్డి, నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.