MLA Payal Shankar: పీఎం విశ్వకర్మ ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్

సిరాన్యూస్‌,ఆదిలాబాద్
పీఎం విశ్వకర్మ ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్
* పీఎం విశ్వకర్మ శిక్షణ పొందిన లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేత
* దళారుల ప్రమేయం లేకుండా పీఎం విశ్వకర్మ పథకం

కుల వృత్తుల దారులకు ఉపాధి కల్పించాలని గొప్ప ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పీఎం విశ్వకర్మ పథకంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుల వృత్తుల ను అభివృద్ధి చేసేందుకు, వారికి ఉపాధి కల్పించాలని ఉద్దేశంతోనే పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రారంభించి సంవత్సరం పూర్తి కావస్తుందన్నారు. ఈ పథకం లో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు బ్యాంకు ద్వారా రుణం పొందే అవకాశాన్ని కల్పిస్తుంది అన్నారు. ఆన్లైన్లో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ద్వారా కేంద్రానికి పంపించడం జరుగుతుందన్నారు ఆ తర్వాత కేంద్రం నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో నగదు జమ చేసిందన్నారు. పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత రుణం తీసుకున్న లబ్ధిదారులు సక్రమంగా వాయిదా పద్ధతులను ద్వారా డబ్బులు కట్టుకుంటే మళ్లీ తిరిగి రెండు లక్షల రూపాయలు వారికి రుణం ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుంటారు అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు పీఎంఈజిపి, పిఎంఎఫ్ఎంఈ ద్వారా రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పట్టణ ప్రాంతంలో 25శాతం గ్రామీణ ప్రాంతాలలో 35 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఏదైనా సంక్షేమ పథకాలు ప్రజలు సరైన రీతిలో వాటిని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్య‌క్ర‌మంలో లాలా మున్న, ఆకుల ప్రవీణ్, రఘుపతి, భారత, దయాకర్, అశోక్ రెడ్డి, ముకుంద్, తదితులున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *