సిరాన్యూస్, ఆదిలాబాద్
జోగురామన్న నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే పాయల్ శంకర్
* అన్ని రాష్ట్రాలలో సీసీఐ ఒకే ధర పత్తి కొనుగోలు
గుజరాత్ రాష్ట్రంలో సీసీఐ ఒక్క రూపాయి ఎక్కువ పెట్టి పత్తి కొనుగోలు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే జోగురామన్న నిరూపిస్తే.. నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన జోగు రామన్న భారతదేశంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) దేశము మొత్తంలో ఒకే ధరతో పత్తి కొనుగోలు చేస్తున్న విషయం నీకు తెలియదా అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా పత్తి కొనుగుల విషయంలో అనవసరంగా మాజీ మంత్రి జోగు రామన్న రాద్దాంతం చేస్తున్నారన్నారు. గుజరాత్ రాష్ట్రంలో సీసీఐ ఒక్క రూపాయి ఎక్కువ పెట్టి పత్తి కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే.. నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి అక్కడి నుంచి అసెంబ్లీకి లెటర్ పంపిస్తానన్నారు. సిగ్గు లేకుండా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ మార్కెట్ కు రైతులు పత్తి తీసుకువస్తే నాలుగైదు రోజులు పత్తిని ఎండబెట్టుకుంటేనే కానీ పోలేని పరిస్థితిలో దుస్థితిలో ఉండేదని గుర్తు చేశారు. ఆరోజు రైతులు పత్తిని ఎండబెట్టిన ఆధారాలు ఉన్నాయని చూపించారు. అవన్నీ మర్చిపోయి నేడు భారతీయ జనతా పార్టీ పైన, నా పైన లేనిపోని ఆరోపణలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఏం పీకుతున్నారని చేసిన వ్యాఖ్యాలపై సహనం వ్యక్తం చేశారు. మొన్న రైతులు ధర్నా చేస్తుంటే నువ్వాడా పన్నావు అని రామన్నను ప్రశ్నించారు. ఆరోజు హైదరాబాద్ నుండి అన్ని కార్యక్రమాలు వదిలేసి రైతులు ఆందోళన చేస్తున్నారని హుటా హుటిన అదిలాబాద్ కు వచ్చానన్నారు. రాత్రి 11 గంటల వరకు కలెక్టర్ తో కలిసి వ్యాపారులను ఒప్పించి పత్తి కొనుగోలు చేసేలా చూసానన్నారు. దినమంతా రైతులు మార్కెట్ యార్డులో పడిగాపులు కాషారన్నారు. మాజీమంత్రి జోగు రామన్న హుందాగా మాట్లాడుతారని అనుకున్నాను అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే పై భాష మాట్లాడే విధానం మార్చుకోవాలన్నారు. లేకపోతే నేను నా కార్యకర్తలు మాటలు మొదలుపెడితే నీకే కష్టమైతది. అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆదినాథ్, అయ్యన్న గారి భూమయ్య, జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, మయూర్ చంద్ర, లాలా మున్నా కృష్ణ యాదవ్, జోగు రవి, ఆకుల ప్రవీణ్, రాజేష్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ సతీష్, భరత్, శివ ముకుంద తదితరులు పాల్గొన్నారు.