సిరాన్యూస్, కళ్యాణదుర్గం
కార్యకర్తల కోసం 10 మద్యం షాపులకు టెండర్లు: ఎమ్మెల్యే సురేంద్రబాబు
ఎన్నికల్లోనా కోసం ఎంతో శ్రమించారు. ఇప్పుడు సమయంవచ్చింది. నా వంతుగా మీ అభివృద్ధికి కృషి చేస్తా అన్న రీతిలో టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబునడుం బిగించారు.ఈనేపథ్యంలో కార్యకర్తలకు ఇవ్వడానికి తన సొంతడబ్బుతో మద్యంషాపులకు టెండర్లు వేశారు.నియోజకవర్గంలోని కంబదూరు, కుందుర్పిశెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం టౌన్, కళ్యాణదుర్గం రూరల్పరిధిలో సుమారు 10 మద్యంషాపులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన సొంత నిధులతో టెండర్లు వేశారు. మద్యంషాపులకు దరఖాస్తు చేయడానికి రుసుం రూ.2లక్షలు (నాన్రిఫండబుల్చెల్లించాలి. నియోజకవర్గ కార్యకర్తల తరపున 10 మద్యం షాపులకు 75మందితో సొంతడబ్బు చెల్లించి దరఖాస్తు చేయించారు. లాటరీ పద్ధతిలోఎన్నిమద్యం షాపులు వస్తే, వాటినన్నింటినీ కష్టపడ్డ కార్యకర్తలకే ఇవ్వనున్నారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఉచిత డీఎస్సీ శిక్షణ, ఉచిత డ్రైవింగ్, నిరుపేదలకు తోపుడు బండ్ల పంపిణీ, ఆలయాలకు విరాళాలు, ఉచిత వైద్యసదుపాయాలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థికసాయం పంపిణీ, కంబదూరులో నిరుపేదల ముస్లిం కుటుంబానికి పక్కా గృహం నిర్మాణం కోసం రూ. 5 లక్షలు పంపిణీ చేస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో అమిలినేనితన వంతు కృషి చేస్తున్నారు.