సిరాన్యూస్, ఉట్నూర్
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి గురువులు నిరంతరం కృషి చేస్తారని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని పిఎంఆర్సీ భవనంలో ఐటీడీఏ పిఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ముందుగా ఐటీడిఏ పిఓ ఖుష్బు గుప్తా అధికారులతో కలసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల అర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.ఈసందర్బంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మనిషిని సమాజంలో ఓ గొప్ప స్థాయికి తీసుకెళ్లడానికి గురువులు చేస్తున్న కృషి మరవలేనిదన్నారు. అనేక మందిని డాక్టర్లుగా, ఇంజీనిర్లుగా, శాస్తవేతలుగా, పోలీసులుగా, రాజకీయ నాయకులుగా, మేధావులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారన్నారు.తాను ఓ ఆశ్రమ పాఠశాలలో, రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకొని ఎమ్మెల్యే గా ఎదగడానికి గురువులు అందించిన ప్రోత్సాహం మరవలేనిదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యా అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు .గురుకులలో,కళాశాలలో మెరుగైన విద్యాను అందించేందుకు నిరంతరం పాటు పడుతుందాన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఉప రాష్ట్రపతిగా ఈ దేశానికి ఎనలేని సేవలందించారని,అప్పటి ప్రభుత్వం అయన జన్మదినంను ప్రతి యేటా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తు వస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ అయన చూపిన బాటలో నడవాలని పిలుపు నిచ్చారు.అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఐటీడిఏ పిఓ,అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.