MLA Vedma Bojju Patel: పెరటి కోళ్ల పెంపకంతో అధిక లాభాలు:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్‌,ఉట్నూర్
పెరటి కోళ్ల పెంపకంతో అధిక లాభాలు:  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు,నిరుద్యోగులకు పెరటి కోళ్ల పెంపకంతో ఉపాధితో పాటు ఆదాయం లభిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని కల్లూరుగూడ గ్రామంలో భావ్యపమం కోళ్ల పరిశోధన సంచనాలయము హైదరాబాద్ వారిచే 360 పెరటి కోళ్లు,100 ఇనుపతో తయారు చేసిన ఇండ్లను పంపిణీ చేశారు. ముందుగా సంస్థ శాస్త్రవేత్తలు పెరటి కోళ్ల పెంపకం పై, వాటి పెంపకం వల్ల కలిగే లాభాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.పెరటి కోళ్లను పెంపకంతో అధిక లాభాలు ఉంటాయని పేర్కొన్నారు.ఈ కోళ్లు అధిక బరువు కలిగి ఉంటాయని దాంతో పాటు అధిక మాంసం, గుడ్లనిస్తాయన్నారు.స్వయం ఉపాధి పొందేందుకు సర్కార్ వారు పెరటి కోళ్ల పెంపకంలో శిక్షణ ఇస్తారని,ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అరటి కోళ్ల పెంపకంతో అధిక నికర ఆదాయం వస్తుందని తెలిపారు.ఇందులో వానరాజా,రాజశ్రీ, శ్రీనిధి ఇలా పలు రకాల కోళ్లు ఉంటాయని పేర్కొన్నారు.నాటు కోళ్లతో పోల్చితే పెరటి కోళ్లు అతి తక్కువ రోజులో పెరుగుతాయన్నారు. నిరుద్యోగ యువత,రైతులు పెరటి కోళ్ల పెంపకంపై దృష్టి సారించి, స్వయం ఉపాధి పొందాలని సూచించారు.కార్యక్రమంలో , ప్రిన్సిపల్ సైంటిస్ట్లు,డా.బి.ప్రకాష్ డా.రాజకుమార్, డా.విజయ్ కుమార్, టెక్నికల్ ఆఫీసర్ ఎస్కే బాంజా,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ భార్గవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *