సిరాన్యూస్, ఓదెల
మహిళలు ఆర్థికంగా ఎదగాలి: ఏపీఎం లతా మంగేశ్వరి
* చర్లపల్లి కవిత యూనిట్‌కు 1000 కోడిపిల్లలు అందజేత
మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఏపీఎం లతా మంగేశ్వరి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లోని మహిళలకు ఇందిరా మహిళా శక్తి లో భాగంగా సభ్యులకు బ్యాంక్ లింకేజీ,స్త్రీనిధి రుణాల ద్వారా గ్రామ సంఘం నుండి పెరటి కోళ్లు, కోడిపిల్ల లను పెంచడానికి ఇవ్వడం జరిగింది.ఇందులో భాగంగానే గురువారం జిలకుంట గ్రామంలో చర్లపల్లి కవిత కి మదర్ యూనిట్ క్రింద 1000 కోడిపిల్లలను అందజేశారు. అనంతరం ఏపిఎం లతా మంగేశ్వరి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి మంచి పథకమని అన్నారు.ఈ కార్యక్రమం లో సీసీ లు మారెళ్ళ శ్రీనివాస్,మల్లయ్య,కొమురయ్య,విజయ,రాజకుమారి అకౌంటెంట్ భవాని ఆపరేటర్ పవన్ కుమార్,విఓఏ లు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.