సిరాన్యూస్, ఉట్నూర్
కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల అందజేత : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఖానాపూర్ నియోజవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకం వల్ల ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకమైన పథకాలను అమలు చేస్తోందన్నారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం,500 రూపాయలకే గ్యాస్ అందజేస్తున్నామని తెలిపారు. త్వరలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అందజేస్తామని అన్నారు.ఇండ్లు లేని పేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.