సిరాన్యూస్, ఇంద్రవెల్లి
త్వరలో తులం బంగారం ఇస్తాం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం వరం
పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం వరమని, పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఎంపీడిఓ కార్యాలయంలో 73మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందన్నారు.త్వరలో లక్ష రూపాయాలతో పాటు తులం బంగారం అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.