MLA Vedma Bojju Patel:  ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్, ఉట్నూర్
 ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

అధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ట్రైబల్ వెల్ఫేర్,పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులపై, పెండింగ్ లో ఉన్న బిల్లుల వివరాలను అడిగి తెలుకున్నారు.పెండింగ్ లో ఉన్న పనులను త్వరీతగతిన పూర్తి చేయాలనీ ఆదేశించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను ఇప్పించేలా సీఎం రేవంత్ రెడ్డితో తాను మాట్లాడతానని పేర్కొన్నారు.అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి జ్యాప్యం వహించవొద్దన్నారు.ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడమే అధికారుల లక్ష్యం కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *