MLA Vedma Bojju Patel: వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్, కడెం
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

నిర్మ‌ల్ జిల్లా క‌డెం మండలంలోని పెద్దూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు.రైతులు తమ ప్రతి పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దే అమ్మాలని సూచించారు.వరి గ్రేడ్ -ఏ క్వింటాల్ కు రూపాయి 2320,సాధారణ వరి క్వింటాల్ కు 2300 రూపాయాల ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. రైతులెవరు దళారులను నమ్మకూడదని, ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దే తమ పంటల అమ్మకాలను చేపట్టాలన్నారు.కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *