సిరాన్యూస్, ఆదిలాబాద్
ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు సన్మానం..
అదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా రు.10 కోట్ల సిఆర్ఆర్ గ్రాంట్ తో పాటు ఎస్డిఎఫ్ నిధుల కింద మరో రూ.4 కోట్లు మంజూరు చేయించిన శాసనసభ్యులు పాయల్ శంకర్ కి శుక్రవారo బిజెపి నాయకులు, పార్డి గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన కోసం ముఖ్యమంత్రిని, ఇన్చార్జి మంత్రి సీతక్కను మెప్పించి నిధులు రాబట్టినందుకు వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న జైనథ్ మండలం పార్డి -బి – మేడిగూడ కెనాల్ రోడ్డుకు రు. 3.50 కోట్లు, భీమ్సరి వాగు పై రోడ్డు వంతెన నిర్మాణానికి రూ .3 కోట్లు మంజూరు చేయించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా తరణం వంతెన కింద తాత్కాలిక రోడ్డు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం పట్ల వారు ప్రత్యేకంగా ఎమ్మెల్యేని అభినందించి శాలువాతో సన్మానించారు. ఎన్నో ఏళ్ల కల ఎమ్మెల్యే పాయ శంకర్ గారి నేతృత్వంలో నెరవేరడం, మారుమూల గ్రామాల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడి నిధులు రాబట్టినందుకు వారు అభినందించారు. ఎమ్మెల్యేను కలిసి సన్మానించిన వారిలో బీజేపీ నాయకులు సుభాష్, కటకం రాందాస్, పోతరాజు రమేష్, ధరం పాల్, గోవర్ధన్, గజానంద్ తదితరులు పాల్గొన్నారు.