సిరాన్యూస్, ఉట్నూర్
వెడ్మ రాము వర్ధంతిని జయప్రదం చేయండి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* కరపత్రాలను విడుదల
ఆదివాసీ అమర వీరుడు వెడ్మ రాము 37వ వర్ధంతిని జయప్రదం చేయాలని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్ధంతి నిర్వహణ కమిటీ, బిరుదు గోండు తోటి సేవా సంఘం సభ్యులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 26న ఆసిఫాబాద్ జిల్లా తీర్యాణి మండలంలోని ఎదులాపాడ్ గ్రామంలో నిర్వహించే వర్ధంతికి జిల్లా నలుమూలల నుండి ఆదివాసీలు, మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం ఎమ్మెల్యే తన వంతుగా 25 వేల రూపాయలు నిర్వహణ కమిటీ సభ్యులకు విరాళం అందజేశారు. కార్యక్రమంలో లక్కారం మాజీ సర్పంచ్ మర్సుకోల తిరుపతి, ఆదివాసీ బిరదుగోండు తోటి సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.