సిరాన్యూస్, ఉట్నూర్
తెలంగాణ పునర్నిర్మాణ సాధకుడు సీఎం రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ఉట్నూర్లో ఘనంగా సీఎం రేవంత్రెడ్డి జన్మదిన వేడుకలు
* ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ
10ఏళ్ళు కేసీఆర్ కుటుంబ పాలనలో దగా పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేపట్టి,పేదల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ మండల కేంద్రంలోని ఐ.బి చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అథితిగా హాజరై కేక్ కట్ చేసి ఇరువురికి తినిపించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు.ప్రతి పేదవాడికి ఆరు గ్యారెంటీలు అందెలా కృషి చేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని,ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2లక్షల రూపాయలను మాఫీ చేశారన్నారు.కానీ కొందరు బిఆర్ఎస్, బీజేపీ నాయకులు సీఎం పై,ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.తన రాజకీయ జీవితంలో నేడు ఓ మర్చిపోనీ జ్ఞాపకమని గుర్తు చేశారు.జీవితాంతం సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటానన్నారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.