సిరా న్యూస్, ఇంద్రవెల్లి:
మురాడి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే…
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో కొలువుదీరిన నాగోబా ఆలయ మురాడి పనులను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మెస్రం వంశీయులతో కలసి ఆదివారం పరిశీలించారు. ముందుగా మురాడి ఆలయంలో నాగోబా దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మెస్రం వంశీయులతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల చివరి వారంలో ఇంద్రవెల్లి అమర వీరుల స్తూపం వద్ద స్మృతి వనంతో పాటు నాగోబా మురాడి ఆలయాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాగా మురాడి ఆలయ పనులను ఈ నెల 20లోగా పూర్తి అయ్యేలా, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.