సిరాన్యూస్, ఓదెల
వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో గుంపుల రూపు నారాయణపేట, పొత్కపల్లి, ఓదెల గ్రామాల్లో ఐకేపీ, సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను బుధవారం ఎమ్మెల్యే విజయ రామారావు ప్రారంభించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓదెల మండలంలో 13 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, ఐజేపి సెంటర్లను ఏపీఎం చూసుకోవాలని తెలిపారు. సింగిల్ విండో సెంటర్లను సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి చూసుకోవాలని అన్నారు. ఇది రైతు ప్రభుత్వం రైతును రాజు ను చేసే ప్రభుత్వమని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుకు గింజ కటింగ్ లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు . ఓదెల మండలంలోని 75శాతం రైతులందరికీ రుణమాఫీ జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో యాకన్న, పోత్క పల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి, ఏపీఎం, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, చీకట్ల మొండయ్య, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపీటీసీలు బోడకుంట లక్ష్మి చిన్న స్వామి, శంకరయ్య, చింతం స్వామి, తీర్థాల వీరన్న, రాపర్తి మల్లేశం ,పెద్దపల్లి మార్కెట్ డైరెక్టర్ గోపతి సదానందం, గడిగొప్పుల సంతోష్, ఇందుర్తి శ్రీనివాస్,,పచ్చిమట్ల శ్రీనివాస్, డాక్టర్ ఎండి సర్వర్ ,మిణుగు సంతోష్ , పిట్టల నరసింగం, రవికుమార్,అంకం రమేష్, అంబాల కొమురయ్య, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు