సిరా న్యూస్, ఓదెల
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం :ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుండ్ల పల్లె, పిట్టల ఎల్లయ్య పల్లె, కనకర్తి, మడక, శానకొండ, జిలకుంట, భీమరిపల్లి,గ్రామాలలో సొసైటీ, ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో తూకంలో తేడాలు రాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఓదెల మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అల్ల సుమన్ రెడ్డి, ఏపిఎం లతా మంగేష్కర్, శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.