– మంత్రి పొన్నం ప్రభాకర్
సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రజలకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీపావళి పండగ శుభాకాంక్షలు తెలియజేసారు. దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించేటప్పుడు మట్టి తో తయారు చేసిన దీపాంతలు వాడాలని విజ్ఞప్తి చేస్తున్నా. పర్యావరణానికి ,ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.. కుల వృత్తులను రక్షించినట్టు ఉంటుంది. బలహీన వర్గాల శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మట్టితో తయారు చేసిన వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మట్టి చాయ్ కప్పులు అయినా ,మట్టి తో తయారు చేసిన వాటర్ బాటిల్స్ వాడుతూ కుమ్మర్లకు ఆర్థికంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.