సిరా న్యూస్,ఓదెల
మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే విజయరమణ రావు
* మదనపు పోచమ్మ చుట్టూ ప్రహరీ గోడకు శంకుస్థాపన
పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రం ఓదెల శ్రీ. మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. మల్లికార్జున స్వామి దేవాలయంలోని మదనపు పోచమ్మ ఆలయం చుట్టూ కీర్తిశేషులు బొ ల్లు రామచంద్రం జ్ఞాపకార్ధంగా వారి కుమారుదు బొల్లు బాలరాజు వరంగల్ ఎన్ఆర్ఐ యు ఎస్ ఏ దాతల సహకారంతో చేపట్టే ప్రహరీ గోడ నిర్మాణానికి శనివారం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు భూమి పూజ చేశారు. ఈసందర్బంగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే కి అర్చకులు, ధర్మకర్త, మండలి చైర్మన్, మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రహరీ గోడ నిర్మాణ దాతలను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించారు. ధర్మకర్త మండలి సభ్యులు ఎమ్మెల్యే విజయరమణ రావు ని గజమాలతో సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రం ఓదెల శ్రీ. మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లి వారి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తమ ఇంటి కులం దైవం కూడా మల్లిఖార్జున స్వామీ వారే అనే ఎమ్మెల్యే తెలిపారు. ఓదెల నుంచి పెగడపల్లి అలాగే ఓదెల మల్లన్న ఆలయం మీదుగా రూ.16 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన పంపించామని త్వరలోనే ఉత్తర్వులు వెలుపడతాయన్నారు.ఆలయం చుట్టూ డబుల్ రోడ్డు నిర్మించి సెంట్రల్ లైట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి ముందుకు వస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా దాతలు ముందుకు వచ్చి ఆలయ తోడ్పడాలని ఎమ్మెల్యే విజయరమణ రావు కోరారు. కార్యక్రమంలో ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ చైర్మన్ మేకల మల్లేశం. ధర్మకర్తలు. మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్. మాజీ ఎంపిటిసి బోడకుంట లక్ష్మి చిన్న స్వామి. మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి.కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి. గడిగొప్పుల సంతోష్. ఇందుర్తి శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు, మల్లిఖార్జున స్వామి వారి భక్తులు తదితరులు పాల్గొన్నారు.