సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్
నిరుపేదల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే విజయరమణా రావు
* కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
నిరుపేదల అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు.పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 52 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూ.52,06,032 విలువ గల చెక్కులను స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. దసరా పండుగ తర్వాత ఇంటి స్థలం ఉన్న ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ఎంపిక చేయాలన్నారు. వానాకాలం పంటకు ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. ఇంకో 15 రోజుల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైతాయని కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి కటింగ్ లేకుండా చూడవలసిన బాధ్యత స్థానిక నాయకుల పై వుందన్నారు. కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.