సిరాన్యూస్, ఓదెల
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మంగళవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా గ్రామీణ అభివృద్ది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వారి సౌజన్యంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో డీఆర్‌డీఓ అధికారులు, మహిళా స్వశక్తి సంఘాల సభ్యులు, మహిళలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.