సిరాన్యూస్, ఓదెల
పద్మశాలి పురోహిత సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రంకు ఘన సన్మానం
పద్మశాలి పురోహిత సంఘం పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా తాటికొండ రామచంద్రం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్బంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో పద్మశాలి మిత్రబృందం రామచంద్రం ను ఘనంగా సన్మానించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్బంగా రామచంద్రం మాట్లాడుతూ పద్మశాలి కుల బాంధవులకు వెన్నంటే ఉండి నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో రామచంద్రం మిత్ర బృందం పాల్గొన్నారు.