సిరాన్యూస్,ఇచ్చోడ
ఎమ్మార్పీఎస్ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : మాల సంఘం మండల అధ్యక్షుడు బొజ్జ లక్ష్మణ్
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని రాజీనామా చేయమనడానికి చెప్పేందుకు ఎమ్మార్పీఎస్ నాయకులకు ఎలాంటి హక్కు లేదని మాల సంఘం మండల అధ్యక్షుడు బొజ్జ లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు మాలల జాతిని కించపరిచినట్లుగా ఉన్నాయని, ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. సమావేశంలో మాల సంఘం సభ్యులు ఈదుళ్ళ శంకర్, భత్తుల ఉషన్న, బొజ్జ రాజకుమార్, మైల మహేష్, చింతల స్వామి తదితరులు పాల్గొన్నారు.