సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే విజయరమణ రావు
* ప్రహరీ గోడ, వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన
గ్రామాల అభివృద్దే తన ధ్యేయమని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఆరెపల్లి గ్రామంలో రూ.5లక్షల నిధులతో నిర్మించే గ్రామపంచాయతీ ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు భూమి పూజ చేశారు. అనంతరం ఎన్నికల సమయంలో ఆరేపల్లి గ్రామస్తులు వాటర్ ప్లాంట్ కావాలని అడగడంతో పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు శుక్రవారం సొంత ఖర్చులతో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందేలా చూస్తానని అన్నారు.ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కి నాయకులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.