సిరాన్యూస్,ఓదెల
ధాన్యం తూకంలో తేడా వస్తే సహించేది లేదు : ఎమ్మెల్యే విజయరమణ రావు
* వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ధాన్యం తూకంలో తేడా వస్తే సహించేది లేదని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అన్నారు. సోమవారం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లి, గొల్లపల్లి, సాంబయ్యపల్లి గ్రామాలల్లో ఐకేపి, సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులు, అధికారులతో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం తూకంలో తేడా వస్తే సహించేది లేదు అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ ,మండల అధ్యక్షులు చిలుక సతీష్, కల్లెపల్లి జానీ ,మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.