పెద్దచెరువు కబ్జాను పరిశీలించిన ఎమ్మెల్యే

 సిరా న్యూస్,భువనగిరి;
అధికారులు నిర్లక్ష్యం వల్ల భువనగిరి పెద్ద చెరువు పూర్తిస్థాయిలో కబ్జాకు గురైందని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. చెరువుకు ఆనుకొని ఇంక్రీడపుల్ ఇండియా అనే రియల్ ఎస్టేట్ సంస్థ చెరువుని పూర్తిస్థాయిలో కబ్జాకు గురిచేసి అక్రమంగా ప్లాట్లు ఏర్పాటు చేసిందని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా చెరువుకు ఆనుకొని న్నగోడనికూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కనీసం మనిషి మరణిస్తే అంతక్రియలకైనా స్థలం లేదని, అంత్యక్రియలకు సంబంధించి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భువనగిరి పెద్ద చెరువు పూర్తిగా 240 ఎకరాలు దీనిలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ చెరువు శిఖం భూమిని కబ్జా చేశారని అన్నారు. గతంలో పెద్ద చెరువుకు రాస కాలువ ద్వారా నీరు వచ్చి చేరేదని కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం వర్షాలు ఎక్కువగా కురిసిన నీరు మాత్రం చెరువులోకి రాలేదని స్థానికులు అంటున్నారు. ప్రకృతిని మనం నష్టపరిస్తే ముందు తరాలకు ప్రకృతిని అందించలేక పోతామని స్థానిక ఎమ్మెల్యే అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో చెరువులు కుంటలు కబ్జాకు గురైన వాటిని తొలగించడం మంచి పరిణామం అని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా పూర్తిస్థాయిలో పనిచేస్తుందని పేద ప్రజల కోసం ప్రత్యేకంగా కల్పించిన తర్వాతనే హైడ్రా పూర్తిస్థాయిలో కొనసాగుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *