సిరా న్యూస్, సూర్యపేట:
హౌసింగ్ కాలనీ అభివృద్ధికి కృషీ…
సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని పనిగిరి రామస్వామి గుట్ట సమీపంలో హౌసింగ్ కాలనీ అభివృద్ధి చేస్తామని భారీ నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం గుట్ట సమీపంలో హౌసింగ్ కాలనీ పనులు పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాగా వచ్చే మూడు నెలల్లో పనులు పూర్తి చేసి నిరుపేదలకు ఇండ్లు అందించడమే కాకుండా, దీన్ని ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని మంత్రులు అన్నారు. వారి వెంట గానుగబండ ఎంపిటీసీ పాకాల రమేష్, వార్డు కౌన్సిలర్లు వీరా రెడ్డి, రాజా నాయక్, నాయకులు మోహన్, సైదులు గౌడ్, ఇతర నాయకులు, అధికారులు ఉన్నారు.