బీసీ ఉద్యోగుల పదోన్నతుల రిజర్వేషన్లపై ఉద్యమం ఉద్ధృతం

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య

సిరా న్యూస్,హైదరాబాద్;

బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని పలు కమిషన్‌లు సిఫార్సు చేసినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య విమర్శించారు. అఖిల భారత బీఎస్‌ఎన్‌ఎల్‌ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో బీసీ ఉద్యోగుల సమ్మేళనం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వాలు వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీసీ ఉద్యోగుల పదోన్నతుల రిజర్వేషన్లపై అన్ని పార్టీలతో చర్చిస్తున్నామని, ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, బీసీ ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ వడ్డేపల్లి హనుమంతు, మరియు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఓబీసీ ఉద్యోగుల సంఘం నేతలు, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *