MP G. Nagesh: రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి : ఎంపీ జి. న‌గేష్‌

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి : ఎంపీ జి. న‌గేష్‌
* విత్తన కంపెనీలు నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలి
* వెరైటీ భజరంగ్ బిజి -2 విత్తన కేంద్రాన్ని ప్రారంభం

రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని ఆదిలాబాద్ ఎంపీ న‌గేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హిందుస్థాన్ అగ్రో సైన్స్ వారి నూతన వెరైటీ భజరంగ్ బిజి -2 విత్తన కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్‌తో క‌లిసి ఎంపీ గోడం నగేష్ ప్రారంభించారు. ఈసంద‌ర్బంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రామాయి గ్రామంలో గల రైతు చేనులో పత్తిని పరిశీలించా మ‌న్నారు. రైతులు విత్తనాల ఎంపికలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతులకు సూచనలు, సలహాలు చేశారు. రైతులు వాతావరణ పరిస్థితులను బట్టి విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ క్షేత్రం అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని కోరారు.విత్తన కంపెనీలు రైతులకు నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పోతన్న, సంతోష్ రఘుపతి, రాందాస్, సుభాస్, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *