అందరికీ అండగా ఉంటామని అభయం
సిరా న్యూస్,ఖమ్మం;
ఇటీవల మున్నేరు వరదలతో దెబ్బతిన్న 29వ డివిజన్ లోని సుందరయ్య నగర్ లైన్ ప్రాంతoలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి పర్యటించారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. ఇంకా దుప్పట్లు, కొబ్బరి నీళ్ల బాటిళ్ళు అందజేసి.. భోజన సదుపాయం కల్పించారు. ఒక్కసారిగా వరద పోటెత్తి.. తాము తీవ్రంగా నష్టపోయామని స్థానికులు ఆవేదన వ్యక్తo చేశారు. స్పందించిన ఎంపి ఆ ప్రాంతం లో కలియతిరిగి చూశారు. అనంతరం లోక్ సభ సభ్యులు రఘురాo రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడి సమస్యలన్నీ పరిష్కరిస్తామని అన్నారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చూస్తామని, బురద మేటల తొలగిoపు పూర్తి చేయించి, రోడ్ల మరమ్మతులు చేయిస్తామని అన్నారు. వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, నాయకులు ఉపేందర్, ఇమామ్ భాయ్, స్ఫూర్తి ఓం రాధా కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.=