సిరా న్యూస్, బేల
జాతీయ జెండాను ఎగర వేసిన ఎమ్మార్వో వామన్
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని తహసీల్దార్ కార్యాలయం లో జాతీయ జెండాను ఎమ్మార్వో వామన్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో వామన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తోందని అన్నారు. కార్యక్రమంలో, గిర్థవార్ అశోక్, సాజిద్ ఖాన్, ఆపరేటర్ శ్రీనివాస్ హరిప్రసాద్ , కార్యాలయ స్టాప్ తదితరులు పాల్గొన్నారు.