సిరా న్యూస్, ఇచ్చోడ
అక్రమ మైనింగ్ క్రషర్, క్వారీల అనుమతులను రద్దు చేయాలి : ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ
అక్రమంగా నడుపుతున్న మైనింగ్ క్రషర్, క్వారీల అనుమతులను రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 11స్టోన్ క్రషర్, 16 క్వారీలు నడుస్తున్నట్లు నివేదికలో అధికారులు చెబుతున్న వీటికి సరైనటువంటి అనుమతులు, పత్రాలు లేవని అన్నారు. పొల్యూషన్, సీఈ, సీఈఫ్, సిప్, ఈ రకమైనటువంటి గైడ్లైన్స్ లేకుండా ఇష్టరాజ్యంగా నడుపుతున్నారని ఆరోపించారు. సహజ వనరులను సర్వనాశనం చేయడం దారుణమన్నారు. మాఫీయా ముఠా లాగా గా నడుపుతున్న యజమాన్యాలపై మైనింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. ఈనెల 16న పిప్పరి శ్రీకృష్ణ క్రసర్ యజమాన్యం నిర్లక్ష్యంతో చత్తీష్‌గడ్ రాష్ట్రం కు చెందిన కూలీ మృతి చెందారన్నారు. ఆ కుటుంబానికి న్యాయం చేయలేదని ఆరోపించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాల ను ఆదుకునేంతవరకు ఎమ్మార్పీఎస్ పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. సమావేశంలో ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు దుబ్బాక సుభాష్ మాదిగ, సిరిసిల్ల భూమయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి జన్నారపు సాయి మాదిగ, మండల అధ్యక్షులు చిట్టి రవి మాదిగ, పట్టణ అధ్యక్షులు చందు మాదిగ, సుంకె అనిల్ మాదిగ, సాయి మాదిగ ,నరేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.