సిరాన్యూస్,ఆదిలాబాద్
సీఎం రేవంత్‌రెడ్డి మాదిగల ద్రోహి : ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించిన సీఎం రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహి అని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్య రంగంలో పలు అడ్మిషన్ల నియామక ప్రక్రియను వేగవంతం చేస్తూ మాదిగ ఉపకులాల ప్రజలకు దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలను మాలలకు దోచిపెడుతూ మాదిగలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారన్నారు. ఈనెల 9న జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 15న ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో నిర్వహించే కార్యక్రమంలో భవిష్యత్తు కార్యచరణ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఎంఎస్పి రాష్ట్ర నాయకులు కంబ్లె బాలాజీ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బారుకుంట సుభాష్ మాదిగ, ఇండ్ల ఎల్లన్న మాదిగ, అరేపల్లి గణేష్ మాదిగ, సందురి వినయ్ సాగర్ జిల్లా నాయకులు దాసరి రాంప్రసాద్, రాజేశ్వర్ ,అల్ల కొండ రవి, సంజీవ్, ప్రణయ పొషెట్టి విలాష్ తదితరులు పాల్గొన్నారు.