సిరాన్యూస్, ఆదిలాబాద్
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి: మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
* ఘనంగా గాంధీజికి నివాళి
గాంధీజీ జీవిత పాఠం అహింసా తో పాటు పరిశుభ్రత వంటి అంశాలను నిత్య జీవిత సత్యాలుగా మలిచిందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమందర్ గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు. మొదట గాంధీ చౌక్ లో ఆర్యవైశ్య సంఘం వారు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని గాంధీజీకి పాలాభిషేక తో పాటు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ పార్క్ లో గాంధీజీకి పూలమాలు వేసే నివాళులు అర్పించి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలువురు మున్సిపల్ కార్మికులను ఘనంగా సత్కరించారు అలాగే ఇంద్ర ప్రియదర్శిని స్టేడియం పరిసర ప్రాంతాల్లో చీపురు చేతపట్టి స్వచ్ఛ పరిశుభ్రత చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో గాంధీ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా పలువురు మున్సిపల్ కార్మికులను చైర్మన్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. మున్సిపల్ కమిషనర్ కమర్ హైమద్, స్టెప్స్ ఏవో వెంకటేశ్వర్లు,డి తిరుపతి, ఆర్ ఐ వెంకటేష్, లయన్స్ క్లబ్ కింగ్స్ అండ్ కాటన్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు ట్రెజరర్ పుప్పాల నరేందర్, సత్యనారాయణ గంగయ్య రవీంద్ర , లైన్ లీడర్స్ మధుసూదన్ రావు, రమాకాంత్ రావు, భగవాన్ దాస్, ప్రేమ రాజ్ తదితరులు పాల్గొన్నారు