Tehsildar Shyamsunder: అంద‌రికీ ఆద‌ర్శం మ‌హాత్ముని జీవితం : తహసీల్దార్ శ్యాంసుందర్

సిరాన్యూస్, జైనథ్
అంద‌రికీ ఆద‌ర్శం మ‌హాత్ముని జీవితం : తహసీల్దార్ శ్యాంసుందర్
* జైనథ్ తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

అంద‌రికీ ఆద‌ర్శం మ‌హాత్ముని జీవితమ‌ని తహసీల్దార్ శ్యాంసుందర్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల తహసీల్దార్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్యాంసుందర్ మాట్లాడుతూ గాంధీజీ భారత దేశ స్వాతంత్ర్యం సాధనలో అనుసరించిన శాంతి, సత్యం, అహింస, వంటి విదానాలు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నయని అన్నారు. దేశాల మధ్య యుద్ధాలు ఉగ్రవాదం, దురాక్రమణనలు,యువత మత్తు పదార్థాలకు బానిస అవడం వంటి అనేక సమస్యల్ని గాంధీజీ అనుసరించిన ఆదర్శాల ఆధారంగా నిర్మూలించవచ్చు‌అన్నారు. విద్యార్థులు అందరూ గాందీజీ జీవిత చరిత్ర చదవాలని, దేశమంతా గాంధీ బాటలో ముందుకు సాగాలని అన్నారు.కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ దేవన్న, రికార్డు అసిస్టెంట్ నందు అనిల్, వీఆర్ే రాఘవ. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *