సిరా న్యూస్, సైదాపూర్:
గాంధీకి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్ నివాళి
* వెన్కేపల్లి-సైదాపూర్ మండల కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలు
వెన్కేపల్లి-సైదాపూర్ మండల కేంద్రంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్ ఆధ్వర్యంలో బుధవారం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ నమ్మిన సత్యం, అహింస సిద్ధాంతాల ద్వారా ప్రతి మనిషి దేనినైనా సాధించవచ్చునని అన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.