సిరా న్యూస్, జమ్మికుంట:
పాపక్కపల్లి లో గాంధీ జయంతి వేడుకలు
జమ్మికుంట మండలం పాపక్కపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025-26 సంవత్సరానికి గానూ పంచాయతీ కార్యదర్శి పోరెడ్డి నరేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రణాళిక గ్రామ సభను నిర్వహించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ నవీన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బందికి శాలువాలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ప్రజలు ఉన్నారు.