సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలి : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సీఎం రావు ఫంక్షన్ హాల్లో మంగళవారం ఖానాపూర్ పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో పీసీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడుతూ ఈ శనివారం 7వ తేదిన జరగబోయే వినాయక చవితి ప్రతిష్టపన ఉత్సవాలను ప్రశాంతంగా అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలన్నారు. అలాగే నిమజ్జనం రోజున ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత గణేష్ మండపాల అధ్యక్షులు, సభ్యుల పైన ఆధారపడి ఉంటుందని తెలిపారు. అలాగే వినాయక మండపాలు వేసేటప్పుడు విద్యుత్ వైర్లు చూసుకుంటూ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ వైర్లకు దూరంగా మండపాలు వేసుకోవాలని తెలిపారు. మున్సిపాలిటీ పాలకవర్గం తరపున వినాయక నిమర్జనం రోజున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్స్ నాయకులు నాయిని సంతోష్ ,పరిమి సురేష్ ,కిషోర్ నాయక్ , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్ధుల్ ఖలీల్ ,మున్సిపల్ కమిషనర్ మనోహర్ ,మండల అధ్యక్షులు దొనికేని దయానంద్ , పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, ఎమ్మార్వో శివరాజ్ ,ఎస్సై లింబాద్రి , హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంత్ర రాజం సురేష్ , కరెంట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు గణేష్ మండపాల అధ్యక్షులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.