సిరాన్యూస్, ఖానాపూర్
సమిష్టి కృషితో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* క్షేత్ర స్థాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన సిబ్బందికి అభినందనలు
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఖానాపూర్ పట్టణంలో వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో నిమజ్జనాన్ని ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. బుధవారం ఖానాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 11 రోజులుగా పట్టణంలో పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది యొక్క కృషి వల్లనే గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకున్నామని తెలిపారు. గణేష్ ఉత్సవాల ను భక్తిశ్రద్ధలతో జరిపి, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ వారికి సహకరించిన విద్యుత్, మున్సిపల్, రెవిన్యూ, అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నిమజ్జనం విజయవంతంగా, ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు, మండపాల నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.