సిరాన్యూస్, ఖానాపూర్
పిల్లలకు పౌష్టికాహారం అందించాలి : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* సత్తనపల్లిలో పోషణ్ అభియాన్ పోషణ మాస కార్యక్రమం
చిన్నపిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు.
ఖానాపూర్ మండల కేంద్రం సత్తనపల్లి గ్రామంలోని రైతు వేదిక కార్యాలయంలో శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాజెక్టు లెవెల్ లో ఖానాపూర్, పెంబి, దస్తూరాబాద్ , కడెం మండలాలకు సంబంధించిన అంగన్వాడీ కేంద్రాల పరిధిలో పోషణ్ అభియాన్ పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్తనపల్లి గ్రామంలోని రైతు వేదిక కార్యాలయంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఖానాపూర్ వారి ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ పోషణ్ మాసం కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్లు అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు పౌష్టికాహార విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలని, ఇంటి భోజనం కంటే అంగన్వాడి కేంద్రాలలో పెట్టేటటువంటి భోజనం వల్లే పిల్లలు ఆరోగ్యంగా బలంగా అవుతారని చెప్పారు. అంగన్వాడి కేంద్రాలలో పెట్టేటటువంటి భోజనంలో పౌష్టికాహార విలువలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అంగన్వాడి సిబ్బంది అందిస్తున్నటువంటి సేవలు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం, ప్రతిజ్ఞ కార్యక్రమం, అంగన్వాడీల ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతకార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సీడీపీఓ సరితా ,కౌన్సిలర్ నాయకులు జన్నారపు శంకర్ , నాయిని సంతోష్ , అమానుల్లా ఖాన్ , షబ్బీర్ పాషా ,ఖానాపూర్ ఎంపీడీవో సునీత , పెంబీ ఎంపీడీవో రామకాంత్ ,అధికారులు ఐదు మండలాలకు చెందిన అంగన్వాడి టీచర్స్, తదితరులు పాల్గొన్నారు