సిరా న్యూస్,ఖానాపూర్ టౌన్
మహాత్మా గాంధీకి మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం నివాళి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీ చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను, బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్స్, నాయకులు, కిషోర్ నాయక్ , షబ్బీర్ పాషా , నాయకులు నయీమ్ ,జహీర్ , మహాజన్ జితేందర్ , వాసవి క్లబ్ సభ్యులు, మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.