సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ప్రయోజనాలు: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియ బహుళ ప్రయోజనాలు కలిగిస్తుందని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రక్రియను శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో శ్రీరామ్ నగర్ కాలనీ 4వ వార్డులో శనివారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, జడ్పీసీఈఓ గోవింద్ నాయక్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రక్రియను నాలుగో వార్డులో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రక్రియను ప్రారంభించామని, ప్రజలు అధికారులకు, సిబ్బందికి సహకరించాలని అన్నారు .కార్యక్రమంలో కౌన్సిలర్స్, నాయకులు, జన్నారపు శంకర్ , పరిమి సురేష్ , కుర్మా శ్రీనివాస్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ ,మండల అధ్యక్షులు దొనీకేని దయానంద్ , పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ , నాయకులు రాజేందర్, శేషాద్రి,మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.