సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు : మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం
* మొరం తవ్వకాల ప్రాంతాల పరిశీలన
నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో గత కొన్ని రోజులుగా ఖానాపూర్ పట్టణంలో జరుగుతున్న అక్రమ మొరం తవ్వకాలపై శనివారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దయనంద్ లు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మొరం నిల్వలను తవ్విన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో మొరం అక్రమ తవ్వకం దారులు రాత్రిళ్లు తవ్వకాలు జరిపి, ప్రైవేట్ వెంచర్ లలో వేస్తున్నట్లు సోషల్ మీడియా లో వచ్చిన వార్తలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ విషయం పై కొందరు కావాలని సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పై, కాంగ్రెస్ నాయకుల పై డబ్బులు ఇచ్చినట్లు అసత్యపు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు చేసిన వ్యక్తుల పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారమన్నారు. మొరం తవ్వకాల పై జిల్లా కలెక్టర్ కు, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు . బీఆర్ఎస్ పార్టీ కి చెందిన కొందరు అక్రమ మొరం రవాణా కు పాల్పడుతున్నారని, ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదన్నారు. అలాగే మా నాయకుల ప్రమేయం ఉన్నట్టు తేలితే పార్టీ క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.వారి వెంట కాంగ్రెస్ పార్టీ మండల జనరల్ సెక్రెటరీ షబ్బీర్ పాషా,పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్,నాయకులు తోట సత్యం,శేషాద్రి, బి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.